తాజా వార్తలు

Wednesday, 22 June 2016

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి దయనీయం

 దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైందని, అనేక మంది నేతలు కాంగ్రెస్‌ను వీడి పోతున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలో జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావుల అనుచరులు బుధవారం కవిత సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి గులాబీ పార్టీయే శ్రీరామరక్ష అని, అందుకే అన్ని పార్టీల నుంచి నాయకులు వలస వస్తున్నారని అన్నారు.

వాస్తవాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు లేనిపోని విమర్శలతో ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారని ఎద్దేవా చేశారు.  సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వస్తున్నారే తప్ప, పదవుల కోసం కాదనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని పేర్కొన్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment