తాజా వార్తలు

Thursday, 9 June 2016

ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ

కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిన్న కాపు ఉద్యమ నేతను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ముద్రడగ పద్మనాభం రాజమండ్రి ఆస్పత్రిలో శుక్రవారం తన దీక్ష కొనసాగిస్తున్నారు. వైద్యులు ఆయనకు బీపీ, షుగర్ పరీక్షలు చేశారు.

బీపీ 150/100, షుగర్ లెవల్స్ 242 ఉన్నాయి. ప్రస్తుతానికి ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాపులకు రిజర్వేషన్, తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన పరిణామాలపై నమోదైన కేసుల ఉపసంహ రణ డిమాండ్లతో ముద్రగడ గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన స్వగృహంలో కుటుంబ సమేతంగా ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment