తాజా వార్తలు

Wednesday, 15 June 2016

అవన్నీ పుకార్లే అన్న పవన్ అత్తయ్య…

‘మిర్చి’ సినిమాతో తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నదియా తరువాత ‘అత్తారింటికి దారేది’, ‘అ ఆ’ సినిమాలతో వరుస విజయాలను అందుకుంది. దీంతో ఆమెను తమ సినిమాలలో నటింపజేయడానికి దర్శక, నిర్మాతలు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే వరుస విజయాలతో ఆమె భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తూ దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందని వార్తలు వచ్చాయి.
తాజాగా వీటిపై స్పందించింది నదియా. తను రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నానని వచ్చిన వార్తల్లో నిజం లేదని, కథ బాగుంటే ఏ సినిమాలోనైనా నటించేందుకు సిద్ధమేనని చెప్పింది ఈ మాజీ హీరోయిన్. అంతేకాదు ఎవరో గిట్టని వాళ్లే ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది నదియా.
« PREV
NEXT »

No comments

Post a Comment