తాజా వార్తలు

Thursday, 30 June 2016

‘నేను లోకల్’ అంటున్న నాని…

వరుస సక్సెస్‌లతో పాటు తన స్పీడును కూడా పెంచేశాడు నాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం విరంచి వర్మ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ సినిమాలో నటిస్తుండగా, మరోవైపు త్రినాధరావు తో నాని నటించే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ మూవీకి టైటిల్ గా ‘నేను లోకల్’ అనే పేరును పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మాస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కతున్న ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విరంచి వర్మ సినిమా కంప్లీట్ అయిపోయిన తరువాత నాని ఈ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment