తాజా వార్తలు

Monday, 6 June 2016

నెరవేరిన జొకోవిచ్ కల…

టెన్నిస్‌లో పురుషుల ప్రపంచ నెంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ చరిత్ర సృష్టించాడు. అందని ద్రాక్షలా వూరిస్తున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రపంచ నెంబర్‌ 2 ర్యాంకర్, బ్రిటన్‌ ఆటగాడు ముర్రేపై 3-6, 6-1, 6-2, 6-4తో తిరుగులేని విజయం సాధించి… 12వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ గెలుపుతో జొకో, కెరీర్‌స్లామ్‌ పూర్తి చేశాడు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించాడీ సెర్బియా ప్లేయర్. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో విజయంతో, టెన్నిస్‌ చరిత్రలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ వరుసగా గెలిచిన మూడో వ్యక్తిగా నిలిచాడు. కెరీర్ స్లామ్ పూర్తిచేసిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment