తాజా వార్తలు

Thursday, 2 June 2016

టీఆర్‌ఎస్, సీపీఐ కార్యకర్తల మధ్య ఘర్షణ:ఒకరి మృతి

ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో టీఆర్‌ఎస్, సీపీఐ కార్యకర్తల మధ్య  ఘర్షణ చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం టీఆర్‌ఎస్ కార్యకర్తలు గూడూరుపాడులో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంపైకి సీపీఐకి చెందిన కార్యకర్తలు రాళ్లు విసరడంతో ఓ రాయి సత్తి సంగయ్య(55) అనే వ్యక్తికి బలంగా తగిలింది.
దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment