తాజా వార్తలు

Wednesday, 1 June 2016

నామినేషన్లు ఓకే: ఈసీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రాజ్యసభకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ధ్రువీకరించారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించారు. నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని, వాటిని ఆమోదిస్తున్నామని భన్వర్ లాల్ వెల్లడించారు.

శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. తర్వాత ఎన్నికలపై అధికారిక ప్రకటన వెలువడనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు.

వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వి.విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థులుగా కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, కేంద్ర మంత్రి వై. సుజనాచౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నామినేషన్లు వేశారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తరపున డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు నామినేషన్లు దాఖలు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment