తాజా వార్తలు

Monday, 27 June 2016

పాస్ బుక్ ల రద్దు వద్దే వద్దు: నాగిరెడ్డి

రైతుల పట్టాదార్ పాస్ బుక్ లు, టైటిల్ డీడ్ బుక్ లను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైయస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎమ్ వీ ఎస్ ఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. టెక్నాలజీ వాడకాన్ని తామంతా స్వాగతిస్తామని, అదే సమయంలో రైతాంగం ఆ స్థాయిలో సన్నద్ధత పొందలేదన్న సంగతి గుర్తించాలని ఆయన అన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు పాతిక, ముప్పై సంవత్సరాలుగా పాస్ బుక్ లు అమల్లో ఉన్నాయని, ప్రతీ ప్రభుత్వం వీటిని ఆదునీకరించింది తప్పితే మొత్తంగా రద్దుకి ప్రయత్నించలేదని గుర్తు చేశారు. ఏ రైతు సంఘం కూడా పాస్ బుక్ లు రద్దు చేయాలని కోరలేదని తెలిపారు. అటువంటప్పుడు పాస్ బుక్ ల రద్దు కు చీకటి జీవో ను విడుదల చేయటం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు
« PREV
NEXT »

No comments

Post a Comment