తాజా వార్తలు

Saturday, 18 June 2016

'కడప కింగ్'గా పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు ఎస్ జే సూర్య. నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తి కావచ్చింది.

అయితే ఈసినిమా ప్రారంభం అయిన సమయంలో హుషారు అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను చేస్తున్నట్టుగా తెలిపారు. అది ఫైనల్ టైటిల్ కాదని త్వరలోనే టైటిల్ వెల్లడిస్తామన్నారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. చిత్ర నిర్మాత శరత్ మరార్ ఫిలిం ఛాంబర్ లో కడప కింగ్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారు.

అయితే ఇదే పవన్ సినిమా టైటిల్ అన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఓపెనింగ్ సమయంలో పవన్ ఫ్యాక్షనిస్ట్ లా తెల్ల బట్టల్లో కనిపించటం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. నిజంగానే పవన్ సినిమా టైటిల్ కడప కింగా కాదా తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment