తాజా వార్తలు

Friday, 10 June 2016

రెండ్రోజుల్లో ప్లాట్ల నోటిఫికేషన్

మరో రెండు రోజుల్లో రాజధానిలో ప్లాట్లు కేటాయించేందుకు నోటిఫికేషన విడుదల చేయనున్నారు. నేలపాడు నుంచే ప్లాట్ల్ల కేటాయింపు పక్రియ జరపనున్నారు. లాటరీ పద్ధతిలో ఈ కేటాయింపులు జరగనున్నాయి. ప్రస్తుతం సీఆర్‌డీఏ ప్లానింగ్‌ అధికారులు లేఅవుట్ల రూపకల్పనలో ఉన్నారు.పాట్ల కేటాయింపుల పాలసీపై డిఫ్యూటీ కలెక్టర్లతో సీర్‌డీఏ భూవ్యవహారాల డైరెక్టర్‌ చెన్నకేశవరావు, ఐటీ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం తుళ్ళూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రైతులు సూచించిన ప్లాట్ల సైజులు వాటికి కేటాయించే లేఅవుట్‌పై సమీక్ష జరిపారు. లాండు పూలింగ్‌ యూనిట్ల పరిధిలో రైతులు 9.18 లో సూచించిన ప్లాట్ల వివరాలను ఆన్‌ లైన్‌లో నమోదు చేయాల్సిందిగా ఆదే శించారు. గతంలో రైతులు కోరిన ప్లాటుకు ఇష్టపడి పొలం కొనుగోలు చేస్తే, రిజిస్టేషన్‌ అనుమతికి డీసీలు ఎన్‌వోసీ ఇవ్వాలని సూచించారు. ప్లాట్ల విస్తీర్ణం, రైతుల వివరాలు తదిర అంశాలను నమోదు ఎలా చేయాలనేది పవర్‌పాయింటు ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేశారు. సమావేశంలో వోయస్డీ రహంతుల్లా, అన్నీ యూనిట్ల డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment