తాజా వార్తలు

Wednesday, 1 June 2016

తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జూన్‌ 2న సంబురాలు జరుపుకోనున్న తెలంగాణ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అనతికాలంలోనే దేశంలో అన్నిరాష్ట్రాలతో పాటు అభివృద్ధి పథంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రజల ఆశయాలు, అభిలాష నెరవేరాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు బుధవారం సందేశాన్ని పంపారు. భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజలు ప్రతిఒక్కరూ భాగస్వాములై నిరంతరం శ్రమిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నిలుపుతారని ఆశిస్తూన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment