తాజా వార్తలు

Monday, 13 June 2016

తెలంగాణలో విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె…!

పెండింగ్‌లో ఉన్న డిమాండ్లు పరిష్కరించండంటూ ఒత్తిడి పెంచుతున్నారు తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు. ధర్నాలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి సమ్మె హెచ్చరికలు చేస్తున్నారు. ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ కూడా పెట్టారు విద్యుత్‌ ఉద్యోగులు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడం, అన్‌ లిమిటెడ్‌ హెల్త్‌కార్డ్‌ సదుపాయంవంటి డిమాండ్లతో ఆందోళనకు దిగింది తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ. ధర్నాలతో హోరెత్తించింది. విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డితో మంగళవారం చర్చలు జరపబోతున్నారు జేఏసీ ప్రతినిధులు. ఆ చర్చల్లో అవగాహన కుదిరితే ఓకే… లేదంటే బుధవారం నుంచి సమ్మె చేస్తామంటున్నారు ఉద్యోగులు.

ప్రభుత్వ స్పందన సరిగా లేకుంటే ఇంజినీర్లు మినహా మిగతా ఉద్యోగులంతా సమ్మెకు సిద్ధమవుతున్నారు. కాంట్రాక్ట్‌, రెగ్యులర్‌ కలిసి 40వేలమంది ఎంప్లాయిస్‌ తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉన్నారు. వీరంతా సమ్మెకు సిద్ధమవుతున్నారు. 24గంటలూ ఎమర్జెన్సీ సర్వీస్‌ అందిస్తున్నా… కాంట్రాక్ట్‌ పేరుతో ఏళ్ల తరబడి వెట్టిచాకిరి చేయిస్తున్నారు తప్ప సర్వీసుల్ని క్రమబద్దం చేయడం లేదని వాపోతున్నారు విద్యుత్‌ కార్మికులు.
« PREV
NEXT »

No comments

Post a Comment