తాజా వార్తలు

Friday, 10 June 2016

ఏపీ స్థానికతకు రాష్ట్రపతి ఆమోదం…

ఏపీ ఉద్యోగులకు శుభవార్త. స్థానికతపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లే పిల్లలకు స్థానికత కల్పించే అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. 2017 జూన్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే వారి పిల్లలకు వారు కోరుకున్న జిల్లాలో స్థానికత కల్పించేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతేడాది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

ఏపీ విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఫైల్ ను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి… స్థానికత ఫైల్ పై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోద ముద్రవేశారు.

ఏపీలో స్థానికతపై కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 2 లోపు ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లే ఉద్యోగులకు స్థానికత వర్తించనుంది. ఈ నెల 27లోగా ఉద్యోగులంతా అమరాతికి తరలిరావాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

స్థానికత అంశం కొలిక్కి రాకపోవడంతో ఇప్పటి వరకూ ఉద్యోగులు సందిగ్ధంలో ఉన్నారు. స్థానికతపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగులకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. కేంద్రం నిర్ణయంపై ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment