తాజా వార్తలు

Saturday, 25 June 2016

రైతు రుణాల కోసం 29న ధర్నాలు

పాత బకాయిలతో నిమిత్తం లేకుండా రైతులకు తక్షణమే ఖరీఫ్ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో తిరుపతిలో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశాల్లో ఆమోదించిన పలు తీర్మానాలను శుక్రవారం విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరించారు.
రుణమాఫీ హామీని రాష్ట్రప్రభుత్వం సరిగా అముల చేయకపోవడంతో రైతులపై వడ్డీభారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రుణాలు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment