తాజా వార్తలు

Thursday, 9 June 2016

టీచింగ్ చేస్తానంటున్న ఆర్బీఐ గవర్నర్…

ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ పదవి కాలం సెప్టెంబర్‌ 4తో ముగుస్తోంది. ఒక వేళ ఆయన పదవీ కాలన్నీ పొడిగించకపోతే ఏం చేస్తారు..? ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నే ఇది. అయితే దీనికి సమాధానాన్ని రాజన్ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు.

ఆర్‌బీఐ గవర్నర్‌గా పదవీ విరమణ తర్వాత బోధన రంగంలోకి ప్రవేశిస్తాన్నానని రాజన్ తెలిపారు. ఈ విషయంలో పక్కా క్లారిటీగా ఉన్నట్టు ఆయన చెబుతున్నారు. అయితే, తన పదవీ కాలం పొడిగింపుపై వస్తున్న ఊహాగాలపై స్పందించేందుకు మాత్రం నిరాకరించారు. మరోవైపు సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు అర్థం లేనివిగా కొట్టి పారేశారాయన. ఆధారాల్లేని ఆరోపణల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు రఘురామ్‌ రాజన్‌. అయితే రఘురామరాజన్ ను మరోసారి ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగించాలని నెటిజన్లు కోరుతున్న విషయం తెలిసిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment