తాజా వార్తలు

Friday, 3 June 2016

రాజ్యసభకు విజయసాయిరెడ్డి

జిల్లాకు చెందిన వేణుంబాకం విజయసాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి రాజ్యసభ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. ఉన్నత విద్యావంతుడు విజయసాయిరెడ్డి పెద్దల సభకు ఎన్నిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామానికి చెందిన వేణుంబాకం విజయసాయిరెడ్డి చదువుకునే రోజుల నుంచి ఒక మంచి వ్యక్తిగా తనకుంటూ అందరిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రాథమిక విద్యను గ్రామంలోనే అభ్యసించగా నెల్లూరులో డిగ్రీ పూర్తి చేశారు. చార్టెడ్ అకౌంటెంట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంబిచారు. అంచెలంచెలుగా ఎదుదుగుతూ వైఎస్ కుటుంబానికి నమ్మకానికి మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఫలించని కుట్రలు: విజయసాయిరెడ్డి రాజ్యసభకు ఎన్నిక కాకుండా చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు పన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి మరి కొంత మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసి నాల్గవ సీటు కూడా గెలుచుకోవడానికి నీతిమాలిన రాజకీయం చేశారు. ఇందులో భాగంగానే జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దింపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను తమ వైపునకు మళ్లించుకునేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు.  విజయసాయిరెడ్డి ఎన్నికకు అవసరమైన సంఖ్య కంటే అధికంగా ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపు నిలబడడంతో బాబు కుట్రలు ఫలించలేదు. దీంతో విజయసాయిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవం అయింది.
« PREV
NEXT »

No comments

Post a Comment