తాజా వార్తలు

Friday, 24 June 2016

అప్పుడే జిల్లాలెందుకు?: రాపోలు

రాష్ట్ర విభజన అనంతరం ఇంకా ఉన్నతాధికారుల విభజనే పూర్తికాలేదని, అప్పుడే కొత్త జిల్లాలు ఎందుకంటూ సీఎం కేసీఆర్‌కు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో కావలసినంత మంది అధికారులు, ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు లేనప్పుడు ఇలాంటి నిర్ణయాలు సమంజసం కాదన్నారు.
‘ఇన్ని చిక్కుల్లో ఇప్పుడే కొత్త జిల్లాలు వద్దు. మరీ అవసర మని భావిస్తే... ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కొత్త జిల్లాలు చేయండి. శరవేగంగా జిల్లా సమీకృత సచివాలయ సముదాయాలు నిర్మించండి. ఆ తరువాత మిగతావి’ అని లేఖలో పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment