తాజా వార్తలు

Wednesday, 1 June 2016

సీఎం ఫాంహౌస్ భూముల్లో ముంపు బాధితుల కాలనీ!

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫాంహౌస్ భూములను ఎకరానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తే తన సొంత డబ్బులు అందజేస్తానని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ స్థలంలో ముంపు బాధితులకు మంచి కాల నీ నిర్మించవచ్చని సూచించారు. మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ సర్పంచ్ సునందబాయి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలకు బుధవారం ఆయన సం ఘీభావం ప్రకటించి మాట్లాడారు. ముంపు గ్రామాల ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవద్దన్నారు. మల్లన్నసాగర్‌లో భూములు పోతే బాధిత రైతులు అడుక్కు తినాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశా రు. 
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరిట కేసీఆర్ కుటుంబం రూ.10 వేల కోట్లు దండుకుందని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్‌రావులు తమ భూములను ముంపు బాధితులకు పంచి ఆదర్శంగా నిలవాలన్నారు.  బంగారు తెలంగాణ చేస్తామన్న పాలకులు  ఈ గడ్డను బొందలగడ్డగా మార్చారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మెదక్ మండలం మంబోజిపల్లిలోని ఎన్డీఎస్‌ఎల్ వద్ద కార్మికుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించి ప్రసంగించారు. తాము అధికారంలోకి రాగానే ఎన్డీఎస్‌ఎల్‌ను స్వాధీనం చేసుకుంటామన్న టీఆర్‌ఎస్ రెండేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదని, కేసీఆర్ మెడలు వంచైనా కార్మికులను ఆదుకుంటామని అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment