తాజా వార్తలు

Thursday, 9 June 2016

ఫిట్‌నెస్ లేని బస్సులపై కొరడా ఝులిపించనున్న ఆర్టీఏ…

నాలుగు రోజుల్లో స్కూళ్లు, కాలేజీలు రీ-ఓపెన్‌ కానున్నడంతో అనుమతులు, ఫిట్‌నెస్‌ లేని బస్సులపై దృష్టి పెట్టింది ఆర్టీఏ. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు లేకుండా ప్రైవేటు యాజమన్యాలు బస్సులను నడిపితే, క్రిమినల్ కేసులు పెడుతామని హెచ్చరిస్తున్నారు ఆర్టీఏ అధికారులు. స్కూల్ బస్సులను నడిపే డ్రైవర్ల లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తామంటున్నారు.

మరోవైపు అనుమతులు, ఫిట్‌నెస్‌ లేని బస్సులతో పాటు ఓవర్‌ లోడ్‌తో విద్యార్థులను ఎక్కించుకుంటున్న ఆటోలపై కూడపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇక ఆర్టీఏ అధికారులు ప్రైవేటు స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవడంతో ఇప్పటికిప్పుడు సర్టిఫికెట్లు తీసుకునేందుకు పోటీపడుతున్నాయి యాజమన్యాలు.
« PREV
NEXT »

No comments

Post a Comment