తాజా వార్తలు

Tuesday, 28 June 2016

'400 హామీలిచ్చి.. ఒక్కటీ నిలబెట్టుకోలేదు'

ప్రజాస్వామ్యబద్ధంగా తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబంపై ప్రభుత్వం జరిపిన దాడి పాశవికమని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో మంగళవారం రాత్రి ఆయన ముద్రగడను పరామర్శించారు. ఆసుపత్రిలో అధికారులు వ్యవహరించిన తీరును ముద్రగడ వివరించారు. దీనిపై శైలజానాథ్ విస్మయం చెందారు.

అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముద్రగడ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుంటే.. ఆయన కుటుంబంపై పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని చంద్రబాబాబు దౌర్జన్యం చేయించడం హేయమైన చర్య అన్నారు. దీని ఫలితాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు అనుభవించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం సుమారు 400 హామీలు ఇచ్చారని, ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. భవిష్యత్తులో ముద్రగడ చేపట్టబోయే ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తానని శైలజానాథ్ చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment