తాజా వార్తలు

Sunday, 12 June 2016

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేత సైనా…

ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది ఇండియన్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌. హోరాహోరీగా సాగిన ఫైనాల్లో చైనా షట్లర్‌ సున్‌పై విజయం సాధించింది. సున్‌ యుపై 11-21, 21-14, 21-19 తేడాతో విజయం సాధించింది. ఈ ఏడాది సైనా నెహ్వాల్‌కు ఇదే తొలి టైటిల్‌.

తొలి గేమ్‌లో ఓడిన సైనా… తరువాత అద్భుతంగా పుంజుకుంది. రెండో గేమ్ మొద‌టి నుంచీ దూకుడుగా ఆడిన సైనా.. ఆ గేమ్‌ను 21-14తో సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. చివరకు 21-19 తేడాతో సైనా విజయం సాధించింది.

ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవడం సైనా నెహ్వాల్‌కు ఇది రెండోసారి. 2014లోనూ ఈ సూప‌ర్ సిరీస్ టైటిల్‌ను గెలిచింది సైనా.
« PREV
NEXT »

No comments

Post a Comment