తాజా వార్తలు

Thursday, 9 June 2016

‘శాతకర్ణి’ ఫస్ట్ లుక్ వచ్చిందహో…

బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. శుక్రవారం బాలకృష్ణ పుట్టినరోజును దృష్టిలో పెట్టుకుని ఈ లుక్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇందులో రాజు పాత్రలో బాలకృష్ణ లుక్ అదిరింది. అంతేకాకుండా శాతకర్ణికి సంబంధించిన జెండాలు ఈ పోస్టర్ లో దర్శనమిస్తాయి.

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రియ రాణిగా నటిస్తుండగా, డ్రీమ్ గర్ల్ హేమమాలిని బాలకృష్ణ తల్లి పాత్రలో నటిస్తోంది. కబీర్ బేడి విలన్ గా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment