తాజా వార్తలు

Saturday, 11 June 2016

కట్టప్ప కనిపించడం లేదు!

కట్టప్ప.. ఈ పేరు గురించి పరిచయ వాక్యాలు అవసరంలేదు. ‘బాహుబలి’లోని ఈ క్యారెక్టర్ చాలా పాపులర్. అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. ఈలోపు కట్టప్ప కనిపించడంలేదు? అంటే.. ఎవరికైనా సరే ‘అసలేమైంది?’ అని ఆశ్చర్యం కలగడం సహజం.
విషయం ఏంటంటే.. సత్యరాజ్ తనయుడు శిబీ సత్యరాజ్ హీరోగా ఓ తమిళ చిత్రం రూపొందింది. విడుదలకు సిద్ధమవుతున్న  ఈ చిత్రానికి ‘కట్టప్పావ కానోమ్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అంటే.. కట్టప్ప కనిపించడంలేదని అర్థం.  ఈ టైటిల్ విన్నవాళ్లు కట్టప్ప పేరు పాపులర్ అయ్యింది కాబట్టి, పెట్టి ఉంటారని అనుకుంటున్నారు.  దాంతో చిత్రర్శకుడు మణి క్లారిఫికేషన్ ఇచ్చారు. ‘‘క్రేజ్ కోసం పెట్టిన టైటిల్ కాదిది. కథకూ టైటిల్‌కీ లింక్ ఉంది. అదేంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అని  పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment