తాజా వార్తలు

Friday, 17 June 2016

ఆర్టీసీని మూసేస్తే పోరాటమే: షబ్బీర్ అలీ

నష్టాల్లో ఉందనే సాకును చూపించి ఆర్టీసీని మూసేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని, దీనిపై ఎంతదాకా అయినా తెగించి పోరాడుతామని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ హెచ్చరించారు. శుక్రవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు, తండాలకు నడిపితే నష్టం వస్తున్నదంటూ, ఆ రూట్లను ఆపేయాలనే అధికారం సీఎం కేసీఆర్‌కు ఎక్కడిదన్నారు. ఆర్టీసీని నష్టాల్లోంచి కాపాడటానికి ప్రత్యేకంగా రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ పరంగా ఆర్టీసీకి రాయితీలను ఇవ్వాలని సూచించారు.
 
« PREV
NEXT »

No comments

Post a Comment