తాజా వార్తలు

Sunday, 19 June 2016

నిస్సిగ్గుగా దిగజారుడు రాజకీయాలా: ఉత్తమ్

అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య విలువలను దెబ్బ తీస్తున్నారన్నారు.
ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికీ మేలు జరగలేదన్నారు. కాంగ్రెస్‌కు ఫిరాయింపులతో వచ్చే ఆటుపోటులు కొత్త కాదన్నారు. 2019లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజకీయ విలువలను నేర్పింది గాంధీ, నెహ్రూ, ఇందిర కుటుంబాలేనన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment