Writen by
vaartha visheshalu
11:49
-
0
Comments
అటు ఆట, ఇటు అందంతో టెన్నిస్‌ను కొన్నాళ్లు ఏలిన రష్యా సుందరి మరియా
షరపోవా శకం దాదాపు ముగిసింది. డోపింగ్ టెస్ట్‌లో ఇరుక్కున్న షరపోవాపై
ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ రెండేళ్లు వేటు వేసింది. 2018 మార్చ్
వరకూ ఈ నిషేధం వర్తిస్తుంది. సుదీర్ఘ వాదనల తర్వాత ఫెడరేషన్ తన
నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే దీనిపై న్యాయపోరాటం చేస్తానని షరపోవా
వెల్లడించింది. తను ఉద్దేశపూర్వకంగా తప్పుచేయలేదని ITF కూడా
అంగీకరించిందన్న ఆమె, రెండేళ్ల నిషేధం దారుణమని వ్యాఖ్యానించింది.
ఆరు అడుగులకుపైగా ఎత్తున్న ఈ 29 ఏళ్ల అందాల సుందరి తిరుగులేని ఆటతో కొన్నేళ్లపాటు టెన్నిస్‌ను ఏలింది. ప్రేక్షకులను కళ్లు తిప్పుకోనివ్వకుండా మైదానంలో కూర్చోపెట్టింది. 13 ఏళ్ల వయసులో టెన్నిస్‌లోకి అడుగుపెట్టి, 17 ఏళ్లకే వింబుల్డన్గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. అక్కడ్నుంచి ఆమె కెరీర్ రాకెట్లా దూసుకెళ్లింది. తక్కువ సమయంలోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రముఖ కంపెనీలన్నీ ఆమెతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అత్యధిక ఆదాయం సాధించిన క్రీడాకారిణుల జాబితాలో ఇటీవలి వరకూ ఈ సుందరిదే అగ్రస్థానం.

No comments
Post a Comment