తాజా వార్తలు

Wednesday, 1 June 2016

ప్రత్యేకహోదా వీలుకాదు

14వ ఆర్ధిక సంఘం సూచన ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వీలు కాదని బీజేపీ మహిళా మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. ఈ హోదా ఉన్న రాష్ట్రాలకు కూడా దాన్నితొలగిస్తారని తెలిపారు. విజయవాడలో బుధవారం విలేకరులతో ఆమె మాట్లాడారు.
రాజధాని అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ డీపీఆర్‌లు అందకుండానే కేంద్రం రూ.1,800 కోట్లు ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్‌గా రూ.6 వేల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో నెల రోజులకు సరిపడా బొగ్గును అందుబాటులో ఉంచడంతో విద్యుదుత్పత్తి  పెరిగిందన్నారు. ఈ రెండేళ్లలో కేంద్రం చేసిన పనులు, అభివృద్ధిని వివరించేందుకు రాష్ట్రంలో ఏడుచోట్ల కేంద్రమంత్రులు పర్యటిస్తారని చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment