తాజా వార్తలు

Friday, 3 June 2016

ఏపీ జగన్‌ అయ్యసొత్తు కాదు…!

వైఎస్‌ఆర్సీ అధినేత వైఎస్‌ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌… జగన్‌ మానసిక పరిస్థితి మొదటి నుంచి సరిగాలేదన్న పయ్యావుల… జైలుకెళ్లి వచ్చిన తర్వాత కూడా ఆయన మానసిక స్థితిలో మార్పురాలేదంటూ విమర్శించారు.

జగన్‌ డిప్రెషన్‌లో ఉన్నారన్న కేశవ్‌… ఆయన డిప్రెషన్‌లో ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం… జగన్‌ అయ్య సొత్తు… అబ్బ జాగీరు కాదన్నారు. రెక్కలు విరిగిన ఫ్యాన్‌ను జగన్‌ ఓఎల్‌ఎక్స్‌లో అమ్ముకోవచ్చిన ఎద్దేవా చేశారు పయ్యావుల కేశవ్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment