తాజా వార్తలు

Friday, 10 June 2016

ఎర్రవల్లి, నర్సన్నపేటలో కేసీఆర్‌ పర్యటన…

ప్రజలంతా ఐకమత్యంగా ఉండి దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలపై ముఖాముఖి నిర్వహించారాయన. ప్రతీ ఇంటికీ దేశవాలీ కోళ్లను ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. 10 కోళ్లను కూడా ఇస్తామన్నారు సీఎం.

డబుల్ బెడ్‌రూమ్‌ ఇండ్లు పూర్తయి ఇళ్లలోకి వెళ్లినప్పుడే మనకు పండుగ అన్నారు సీఎం కేసీఆర్‌… ఎర్రవల్లి, నర్సన్నపేటలో ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వడానికి రిలయన్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఇంటిటికీ గోదావరి నీళ్లు, 24 గంటలు తాగునీరు అందుబాటులో ఉంచేందుకు ప్రతి ఇంటికి ట్యాంక్ ఉంటుందని తెలిపారు కేసీఆర్‌.

ఎర్రవెల్లి గ్రామంలో ఏ అభివృద్ధి జరిగినా ప్రజలందరికీ తెలియాలన్నారు కేసీఆర్‌… రెండేళ్ల తరువాత పాములవర్తికి గోదావరి జలాలు వస్తాయన్నారు. వర్షాలు బాగా పడి చెరువులు నిండితే రెండో పంటకు ఢోకా ఉండదని పేర్కొన్నారు. 2800 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయశాఖ అధికారుల సలహాలు.. సూచనలతో పంటలు సాగు చేద్దాం మన్నారు కేసీఆర్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment