తాజా వార్తలు

Saturday, 11 June 2016

త్వరలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ పాలసీ…!

ఎన్‌ఆర్‌ఐల పాలసీ రూపకల్పనపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ దృష్టి పెట్టారు. తెలంగాణలో త్వరలో ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపొందించాలని సూచించారు. గల్ఫ్‌లో ఉపాధి, సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఎన్‌ఆర్‌ఐ పాలసీ ఉండాలని… కేరళ, పంజాబ్‌లలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్‌.
ఎన్‌ఆర్‌ఐ సంఘాలు, గల్ఫ్‌ దేశాల్లో ఎన్‌ఆర్‌ఐల కోసం పనిచేస్తున్న సంస్థలతో త్వరలో సమావేశం కానున్న మంత్రి కేటీఆర్‌. మూసాయిదా రూపొందించిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆమోదం తీసుకుంటామని తెలిపారు కేటీఆర్‌. విదేశాలకు వెళ్లేవారు మోసాలకు గురికాకుండా కొత్త పాలసీ రూపొందించాలని సూచించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment