తాజా వార్తలు

Thursday, 16 June 2016

తీవ్రమైన టి.న్యాయవాదుల ఆందోళన…

ఆంధ్ర న్యాయవాదులను తెలంగాణకు నియమించడాన్ని నిరసిస్తూ అడ్వకేట్ల ఆందోళన తీవ్రమవుతోంది. తెలంగాణవ్యాప్తంగా కోర్టుల ఆవరణలోనే నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వెనక్కువెళ్లేదాకా ఉద్యమం నడుస్తుందని హెచ్చరించారు.

నాలుగు రోజులుగా న్యాయవాదుల ఆందోళనలతో తెలంగాణ కోర్టులు హోరెత్తుతున్నాయి. జిల్లా కోర్టుల దగ్గర తమ డిమాండ్లను వివరిస్తూ… వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తున్నారు. హైకోర్టును విభజించాలని.. 
మార్గదర్శకాలకు విరుద్ధంగా న్యాయమూర్తుల ప్రాథమిక కేటాయింపు జాబితాను రద్దు చేయాలని అడుగుతున్నారు.

హైకోర్టును విభజించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు లాయర్లు. తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతామని ఆప్షన్ ఇచ్చిన ఆంధ్రా జడ్జ్‌లు తక్షణమే దానిని వెనక్కి తీసుకోవాలంటున్నారు. మౌనప్రదర్శన ఒకరోజు, ఇంకోరోజు వంటావార్పు… ఇలా వివిధ రూపాల్లో తమ నిరసనగళం వినిపిస్తున్నారు. వరంగల్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో కోర్టు ఆవరణల్లోనే వంటావార్పు చేసి..కలసి భోజనాలు చేశారు.

తెలంగాణకు చెందిన వారితోనే న్యాయవ్యవస్థ పోస్టులు భర్తీ చేసేదాకా విధులకు హాజరయ్యేదిలేదని స్పష్టం చేస్తున్నారు న్యాయవాదులు.
« PREV
NEXT »

No comments

Post a Comment