తాజా వార్తలు

Monday, 13 June 2016

జీహెచ్‌ఎంసీ అధికారులకు కేటీఆర్‌ క్లాస్‌…!

హైదరాబాద్ రోడ్లను తనిఖీ చేశారు మంత్రి కేటీఆర్. శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్లు మొత్తం తవ్వేసి ఉండడం… ఎక్కడా గుంతలు సరిగా పూడ్చకపోవడంతో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని క్లాస్ పీకారు. పవర్ కేబుల్స్ కోసం గుంతలు తవ్వి… వాటిని మళ్లీ పూడ్చని కాంట్రాక్టర్‌కు పనులు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.

రోడ్లు పరిశీలించిన తర్వాత మంత్రి కేటీఆర్‌… జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రోడ్ల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఏ మాత్రం సంతృప్తిగాలేదని, అందులో ఎలాంటి అనుమానం లేదని వ్యాఖ్యానించారు కేటీఆర్‌. పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు. నగర రోడ్లను ప్రపంచస్థాయిలో తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

అధికారుల పనితీరు మెరుగుపడలన్నారు మంత్రి కేటీఆర్‌. అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రోడ్లు వేయడం… వర్షం రాగానే రోడ్లు గుంతలు పడటం వాటిని తిరిగి పునరుద్దరించడం వంటి పరిస్థితి రావొద్దన్నారు. హైదరాబాద్‌లోని 24 సర్కిళ్లు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు కేటీఆర్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment