తాజా వార్తలు

Monday, 20 June 2016

కాలిఫోర్నియాలో తెలుగు విద్యార్థి గల్లంతు…!

అమెరికా కాలిఫోర్నియాలోని లివర్ మోర్ నదిలో ఓ తెలుగు విద్యార్ధి గల్లంతయ్యాడు. స్నేహితులతో కలసి పడవ షికారుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంకు చెందిన పుట్టా నరేష్ గల్లంతవడంతో… అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కాలిఫోర్నియాలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడని వారు తెలిపారు. మరోవైపు అమెరికా పోలీసులు నరేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నరేష్‌ సహాయ చర్యలకు సహకరించాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, మంత్రులకు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment