తాజా వార్తలు

Monday, 20 June 2016

చిత్తూరు కోర్టులో బాంబు పేల్చింది ఉగ్రవాదులే…!?

చిత్తూరు జిల్లా పోలీసులకు మరో తల నెప్పి మొదలైంది. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలో రాజకీయ రౌడీల హత్యలతో అల్లాడిన వీరికి తాజాగా ఉగ్రవాదుల పేరుతో ప్రభుత్వ కార్యాలయాలకు లేఖలు రావడంతో వాటిపై విచారణకు అదేశించారు జిల్లా ఎస్పీ. మరో వైపు జిల్లా కోర్టు అవరణలో జరిగిన బాంబు పేలుడుకు తామే కారణమంటు అల్ ఉమాతోపాటు, మరో ఉగ్రవాద సంస్థ పేరుతో ఉత్తరం రావడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకొని యాంటీ టెర్రరిస్టు బృందానికి అప్పగించినట్లు తెలుస్తోంది.
నెలన్నర క్రితం చిత్తూరు కోర్టు అవరణంలో వాహానం కింద బాంబు పేలింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికి ప్రత్యర్థులను బెదింరించడానికి పెట్టి వుంటారని భావించిన పోలీసులు… ఆదిశగా విచారణ సాగించారు. ముఖ్యంగా ఆ రోజు కోర్టుకు సీకే బాబుతో పాటు మేయర్ దంపతుల హత్య కేసులో నిందితుడు అయిన చింటూ అలియాస్ చంద్ర శేఖర్ కూడా హాజరయ్యారు.
అయితే ఇందులో పోలీసులు చింటూ మీదా ఎక్కువుగా అనుమానాలు వ్యక్తం చేశారు. కేసు విచారణ ఇక్కడ నుంచి బయట కోర్టుకు ట్రయల్స్ వేయించుకోవడానికి ప్రాణ రక్షణ పేరుతో ఏమైనా పేలుళ్లకు పాల్పడ్డడా అని బావించారు. అయితే చింటూ ఈవిషయంలో తనకు సంబంధం లేదని పోలీసులకు ఉత్తరాలు కూడా రాశాడు. ఇది ఇంకా మిస్టరీగా వుండి పోయింది.
ఈదశలో పది రోజుల క్రితం కేరళలోని కొల్లాంలోని కోర్టు అవరణంలో బాంబు పేలడంతో అది కూడా వాహానం కింద కావడంతో చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ అనుమానంతో అక్కడికి ఓ బృందాన్ని పంపారు. అయితే రెండు బాంబు పెలుళ్లకు సామిప్యత వుండటంతో ఇది ఉగ్రవాదుల చర్యగా భావించారు. ఈవిషయాన్ని యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ కు తెలిపారు. తర్వాత పోలీసులకు అల్ ఉమా పేరుతో ఉత్తరం రావడం… ఇందులో తమది ది డెస్ మూమెంట్ అనే సంస్థ అని ఉత్తరం రాశారు. ఇందులో బిన్ లాడెన్ ఫొటో వున్న చిత్ర పటం వుందని తెలుస్తోంది.
ఇందులో తెలంగాణలో జరిగిన తమ తీవ్రవాద సంస్థ సభ్యుల ఎన్ కౌంటర్ కు నిరసనగా కోర్టులో బాంబులు పేల్చామని, నెక్ట్ మరింత ప్రమాదకరమైన దాడులకు పాల్పడుతామని తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఉత్తరం పుత్తూరు నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పుత్తూరులో అల్ ఉమా ఉగ్రవాదులు గేట్ పుత్తూరులో నివాసము ఏర్పరుచుకున్నారు. 6 నెలల తర్వాత తమిళనాడు పోలీసులు గుర్తించి స్థానిక పోలీసుల సాయంతో పట్టుకోవడం జరిగింది. ఉగ్రవాదుల లేఖలు రాసారా… లేక స్థానికంగా రౌడీ మూకల చర్య అన్న విషయం మీదా విచారణ జరుగుతుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment