తాజా వార్తలు

Wednesday, 1 June 2016

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ అన్నారు. గొల్లపల్లిలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి దశ, దిశ లేదన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉంటే.. ఎవరి కోసం ఈ సంబరాలు చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పోతుందన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దళితులకు మూడెకరాల పంపిణీ, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, కేజీ టు పీజీ విద్య అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment