తాజా వార్తలు

Friday, 17 June 2016

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరు సంతృప్తికరంగా లేదని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో అవి విఫలమయ్యాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు విమర్శించారు. శనివారం నుంచి 3 రోజుల పాటు జరగనున్న కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనడానికి శుక్రవారం ఢిల్లీకి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు రెండేళ్ల పాలన రాజధాని చుట్టూనే తిరిగిందని ఎద్దేవా చేశారు.  భూములు కాజేసేందుకు ప్రభుత్వం కొత్త చట్టాలు, ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్ల సమస్య సున్నితమైందని, అర్హులకే రిజర్వేషన్లు ఉండాలని పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుల్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరిట ప్రజాధనాన్ని వృథా చేస్తోందని విమర్శించారు. కాగా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలపై పెనుభారం మోపిందని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టిందని మండిపడ్డారు. కేంద్ర కమిటీ సమావేశాల్ల్లో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, మోదీ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై చర్చిస్తామన్నారు. కాగా, శుక్రవారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో బెంగాల్‌లో పరాజయం, కాంగ్రెస్ పొత్తు గురించి చర్చించినట్లు సమాచారం.

« PREV
NEXT »

No comments

Post a Comment