తాజా వార్తలు

Monday, 6 June 2016

'ప్రపంచం త్వరలోనే వింతలను చూస్తుంది'

'అన్ని వైపుల నుంచి తీవ్ర మైన ఒత్తిడి ఎదురైతే ఎవరైనా ఏం చేస్తారు? ముస్లింలు కూడా అదే చెయ్యబోతున్నారు. ప్రపంచం త్వరలోనే కొన్ని వింతలను చూడబోతోంది..' అంటూ రాతపూర్వక బెదిరింపులకు దిగాడు జైష్ ఏ మహమ్మద్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్. జైషే అధికారిక  ఆన్ లైన పత్రిక 'అల్ ఖలామ్'లో జూన్ 3న రాసిన వ్యాసంలో భారత్ పైనా తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. కందహార్ విమానం హైజాగ్ ఘటన తర్వాత తనను పట్టుకునేందుకు భారత్ తాలిబన్లకు భారీగా డబ్బును ఎరచూపిందని, దివంగత తాలిబన్ చీఫ్ ముల్లా అఖ్తరే తనకీ విషయం చెప్పాడని అజార్  పేర్కొన్నాడు.

1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు తమ నాయకుడు మసూద్ అజార్ తోపాటు మరో ఇద్దరు కీలక నేతలు ముస్తాక్ అహ్మద, ఒమర్ సయూద్ లను విడిపించుకుపోయిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో కేంద్ర విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ స్వయంగా అజార్ ను తోడ్కొని వెళ్లి కందహార్ లో వదిలేశారు. ఓ వైపు ప్రయాణికుల బట్వాడ జరుగుతుండగానే, అజార్ ను తిరిగి పట్టించాలని కందహార్ ఎయిర్ పోర్టులోని వీఐపీ గెస్ట్ హౌస్ జశ్వంత్ సింగ్.. నాటి తాలిబన్ విమానయాన మంత్రి ముల్లా అఖ్తర్ తో బేరసారాలాడరని అజార్ రాసుకొచ్చాడు.

'హైజాక్ ఉదంతం ముగిసిన కొన్నేళ్లకి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కరాచీ నుంచి కందహార్ వెళ్లాం. విమానయాన మంత్రిగా ముల్లా అఖ్తర్ అక్కడ మాకు ఘనస్వాగతం పలికారు. వీఐపీ గెస్ట్ హౌస్ లోని ఓ సోఫాలో తన పక్కనే కూర్చొబెట్టుకున్నారు. ఆయన నాతో.. 'సరిగ్గా నువ్వు కూర్చున్న చోటే భారత మంత్రి జశ్వంత్ కూర్చుని, నిన్ను పట్టివ్వమని, అందుకోసం ఎంత డబ్బైనా ఇస్తామని అడిగారు' అని చెప్పారు. ఇప్పుడు తాలిబన్ ప్రభుత్వం లేదు. ముల్లా కూడా గత నెలలో చనిపోయారు. తాలిబన్లను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఖతం చేశారు. ఇందులో అమెరికా తర్వాత ఇరాన్ దే ప్రముఖ పాత్ర. తమపై కొనసాగుతున్న దమనకాండను ఎదుర్కొనేందుకు ముస్లింలు ఒకతాటిపైకి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదు. ప్రపంచం త్వరలోనే వింతలను చూస్తుంది' అని మసూద్ అజార్ తన వ్యాసంలో రాశాడు.

అయితే అజార్ ఆరోపణలకు రా అధికారులు తిప్పికొట్టారు. కందహార్ హైజాక్ వ్యవహారంలో డబ్బుల ప్రస్తావన లేనేలేదని రా మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ స్పష్టం చేశారు. 'నాడు కందహార్ లో జశ్వంత్ సింగ్.. తాలిబన్ విదేశాంగ మంత్రి ముత్తా వకీల్ తో మాత్రమే మాట్లాడారు. అజార్ చెబుతున్నట్లు ముల్లా అఖ్తర్ ను కలుసుకోలేదు. దీనికి ఇద్దరే ఇద్దరు వ్యక్తులు సమాధానం చెప్పాలి. అందులో కరైన ముల్లా అఖ్తర్ చనిపోయాడు. రెండో వ్యక్తి జశ్వత్ సిన్హా ప్రస్తుతం కోమాలో ఉన్నారు. కాబట్టి ఆ ఆరోపణల్లో నిజం నిగ్గుతేలే అవకాశమేలేదు' అని మరో రా అధికారి ఆనంద్ అర్నీ చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment