తాజా వార్తలు

Tuesday, 28 June 2016

నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం…!

పులిచింతుల ప్రాజెక్టు నిర్వాసితులకు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న హరీష్‌రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి. పులిచింతుల నిర్వాసితుకు సరైన పరిహారం, పునరావాసం కల్పించింది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. ఇది అసత్యమని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు ఉత్తమ్.

సీఎల్పీ నేత జానారెడ్డిపై, నాపై మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యల‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌. పులిచింతల ప్రాజెక్టు విషయంలో మేం చాలా న్యాయంగా వ్యవహరించామని తెలిపారు. అనేక సార్లు అధికారులతో కలిసి నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించి వారికి సరైన ప్యాకేజ్‌ ఇచ్చామని తెలిపారు.

మ‌ల్లన్న సాగ‌ర్ అంశంపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో హ‌డావుడి చేస్తోందని ఉత్తమ్‌ విమ‌ర్శించారు. ప్రభుత్వ వైఫ‌ల్యాన్ని ఎండ‌గ‌డుతుంటే అధికార పార్టీ నేత‌లు త‌మ‌పై ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.
« PREV
NEXT »

No comments

Post a Comment