తాజా వార్తలు

Sunday, 26 June 2016

సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సమ్మె…

విజయవాడలో సీఐటీయూ 14 వ మహాసభలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు నేతలు. త్రిపుర రాష్ట్ర సీఎం మాణిక్‌ సర్కార్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్మికుల సమస్యలపై సభలో చర్చిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంపై సీపీఎం నేత బీవీ రాఘవులు నిప్పులు చెరిగారు.

ప్రతి ఏటా కోటి మంది నిరుద్యోగులుగా మారుతున్నారన్నారు త్రిపుర సీఎం మాణిక్‌సర్కార్‌, వ్యవసాయ రంగంలో సంక్షోభం కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. టీడీపీ పాలనలో ఏపీ ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని విమర్శించారు. నిత్యావసరాల ధరలు పెరిగినా ప్రభుత్వం చోద్యం చూస్తోందని, రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు దేశానికి మంచిది కాదని, విద్య, వైద్య, బీమా రంగాలను ప్రైవేట్‌పరం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు మాణిక్‌ సర్కార్‌.

బీజేపీ పాలత రాష్ట్రాల సీఎంలు అవినీతికి పాల్పడితే ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మాణిక్‌ సర్కార్‌. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని, కార్మిక రంగం పైనా ప్రభుత్వం దాడులు చేస్తోందని, ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్న మాణిక్ సర్కార్… సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment