తాజా వార్తలు

Friday, 10 June 2016

టీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి: రావుల

తెలంగాణలో రెండేళ్ల పాలనపై టీఆర్‌ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి హితవు పలికారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోం దన్నారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమర్శలకు సమాధానం చెప్పకుండా కేబినెట్‌లోని మంత్రులు ఎదురు దాడి చేస్తున్నారని అన్నారు. పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై లేనిపోని అపోహలు సృష్టిస్తోంది ప్రభుత్వమేనని అన్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment