తాజా వార్తలు

Thursday, 9 June 2016

టీఆర్ఎస్ పై రమణ ఫైర్…

రెండేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ విమర్శించారు. సచివాలయంలో ఎక్కడి ఫైళ్లు అక్కడే ఉన్నాయని, వాటిపై ఉన్న దుమ్ము కూడా అలానే ఉందని అన్నారు. ఇక కేంద్రం ఇస్తున్న నిధులు సరిగా టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా వాడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా కొత్త జిల్లాల పేరుతో టీఆర్ఎస్ రాష్ట్రంలో గంద‌ర‌గోళం సృష్టిస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజ‌నాల‌ను కాపాడ‌డంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ‌హిస్తోంద‌ని, ఆదాయంలో మిగులును సాధించే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల తెలంగాణ‌గా మారిందని ఆరోపించారు. తెలంగాణ‌ ఆదాయం, అప్పుల‌పై శ్వేతప‌త్రం విడుద‌ల చెయ్యాలని ఆయ‌న డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ప్రాజెక్టుల‌కు అన్యాయం జ‌రిగితే స‌హించేది లేదని ఆయ‌న పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment