తాజా వార్తలు

Saturday, 4 June 2016

రూ.220 కోట్ల కరెన్సీ నోట్లు స్వాధీనం


చలామణిలో లేని టర్కీ కరెన్సీని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముఠాను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి టర్కీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ భారత కరెన్సీలో దాదాపు రూ. 220 కోట్లు. శనివారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ కమహాసన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన టి.రత్నకుమార్, గుంటూరు అచ్చయ్య దాబ సెంటర్‌కు చెందిన పి.రామకృష్ణలు స్నేహితులు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ వ్యక్తి దగ్గర నుంచి 96 టర్కీ కరెన్సీ నోట్లను చెలామణి చేసేందుకు తీసుకున్నారు. వారి జిల్లాల్లో చెలామణికి ప్రయత్నింగా ఫలితం లేకపోవటంతో హైదరాబాద్‌లో చెలామాణి చేసేందుకు ప్రయత్నించారు.

ఒక్కో నోటు మన కరెన్సీలో రూ.10 లక్షలు కాగా, దానిని లక్ష రూపాయలకే ఇస్తామని ఆశ చూపారు.ఇలా రాంనగర్‌లోని శ్రీనివాస వస్త్ర దుకాణానికి వచ్చిన విశ్వనాథ్ అనే వినియోగదారునికి వల వేశారు. వీరి మాయమాటలు నమ్మి కె4401420 అనే కరెన్సీ నోటును రూ.20 వేలు అడ్వన్స్‌గా ఇచ్చి తీసుకున్నాడు. అనంతరం విశ్వనాథ్ దానికి సంబందించిన వివరాలు సేకరించి 2005లోనే టర్కీ ప్రభుత్వం ఆ కరెన్సీని రద్దు చేసినట్లు తెలుసుకుని మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిగతా డబ్బులు ఇస్తానని నమ్మించి పిలిపించి, వారిద్దరిని పోలీసులకు పట్టించాడు. రత్నకుమార్, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 96 చెలామణిలో లేని టర్కీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment