తాజా వార్తలు

Saturday, 18 June 2016

“ఉడ్తా పంజాబ్” సినిమా రివ్యూ!

కథ: 
టామీ సింగ్ (షాహిద్ కపూర్), పింకీ (ఆలియా భట్), ప్రీత్ (కరీనా), సర్తాజ్ (దల్జీత్). ఒకరితో ఒకరికి సంబంధం లేకపోయినప్పటికీ… ఈ నలుగురి జీవితంలో “డ్రగ్స్” చాలా కీలకపాత్ర పోషిస్తుంది. అసలు “డ్రగ్స్”కి వారికి సంబంధం ఏమిటి? వారి జీవితంలో “డ్రగ్స్” ఎటువంటి పాత్ర పోషించింది? ఈ “డ్రగ్స్”ను అరికట్టడానికి “ఆ నలుగురు” కలిసి ఏం చేశారు? అనేది క్లుప్తంగా చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు: 
పంజాబీ పాప్ సింగర్ టామీ సింగ్‌గా షాహిద్ కపూర్ ఈ సినిమాలో తన నటవిశ్వరూపం చూపించాడు. డ్రగ్స్ తీసుకొనే మరియు డ్యాన్స్ చేసే సీన్స్ లో అతడి నటనకు చప్పట్లు కొట్టనివారుండరు. హాకీ ప్లేయర్ కావాలనుకొని… కేవలం డబ్బు అవసరం కోసం “డ్రగ్స్” మాఫియా వల్ల ప్రాణానికి ముప్పుతెచ్చుకొన్న పింకీ పాత్రలో ఆలియా జీవించేసింది. ఆ పాత్రలో ఆలియాను తప్ప మరొకని ఊహించుకోలేం.
“డ్రగ్స్”తో తన బోయ్ ఫ్రెండ్ ను కోల్పోయి.. ఆ డ్రగ్స్ ఇంకెవరి జీవితాలను నాశనం చేయకూడదనే ధృడ నిశ్చయంతో… “డ్రగ్స్”కు బానిసైలవారికి ఫ్రీగా ట్రీట్ మెంట్ ఇచ్చే ప్రీత్ పాత్రలో కరీనా సెంటిమెంట్ ను చక్కగా పండించింది. పంజాబీ నటుడు దల్జీత్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హావభావాల పరంగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. డైలాగ్స్ తో అలరించాడు.
విశ్లేషణ: 
సినిమా కథ ఏంటి? అనేది మొదటి 20 నిమిషాల్లోనే అర్ధమయిపోతుంది. ఆ కారణంగా ప్రేక్షకుడికి సినిమా పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఇక డ్రగ్స్ తీసుకొని షాహిద్ చేసే విన్యాసాలు, పోలీసులు-మాఫియా మీటింగులు, మాఫియా ఫైటింగులు ఫక్తు కమర్షియల్ సినిమాలే సాగుతాయి తప్ప ఎక్కడా థ్రిల్ కు గురి చేయవు. పాటల్లో పంజాబీ పదాల పుణ్యమా అని సరిగా అర్ధం కావు. పర్లేదు అనిపించే ఫస్టాఫ్, పసలేని సెకండాఫ్ మేళవింపుగా “ఉడ్తా పంజాబ్” సినిమాలో నటీనటుల పెర్ఫార్మెంస్ గురించి తప్ప చెప్పుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఏమీ ఉండదు.
« PREV
NEXT »

No comments

Post a Comment