తాజా వార్తలు

Friday, 10 June 2016

13న ‘ఉడ్తా పంజాబ్‌’పై హైకోర్టు విచారణ…

ఉడ్తాపంజాబీ కేసును సోమవారం విచారించనుంది బాంబే హైకోర్టు. సినిమా వివాదంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సర్టిఫికేషన్‌పై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. బోర్డు పని సినిమాలను సర్టిఫై చేయడం తప్ప సెన్సార్‌ చేయడం కాదని వెల్లడించింది బాంబే హైకోర్టు.

ఒకవేళ సినిమాలో డ్రగ్స్‌విషయంలో మరీ ఎక్కువగా చూపించారనుకుంటే సినిమా మొత్తాన్ని ఎందుకు నిషేధించడం లేదని ప్రశ్నించింది. టీవీ గానీ, సినిమా గానీ ఏదైనా రాష్ట్రాన్ని అవమానించేలా ఉందా..? లేదా..? అన్న విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలని ఆ స్వేచ్ఛను ప్రజలకు ఇవ్వాలని సూచించింది హైకోర్టు.
« PREV
NEXT »

No comments

Post a Comment