తాజా వార్తలు

Saturday, 11 June 2016

కాంగ్రెస్‌ను వీడరనేది నా నమ్మకం: ఉత్తమ్‌

కాంగ్రెస్‌ పార్టీ నుంచి నేతలెవరూ కాంగ్రెస్‌ను వీడరనేది తన నమ్మకమని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ గీత దాటిన నేతలు ఎంతటివారైనా వారిపై చర్యలు తప్పవని అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌ లో మీడియాతో మాట్లాడారు. పార్టీని వీడాలనుకుంటున్న నేతలతో తాను మాట్లాడనని చెప్పారు. విభజన హామీల అమలులో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌ విఫలమైందని ఉత్తమ్‌ తెలిపారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. రైల్వేకోచ్‌ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటులో కదిలిక లేదని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన గాంధీ ఫ్యామిలీని టార్గెట్‌ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. విభజన హామీల అమలు కోసం ఎందుకు మాట్లాడటం లేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment