తాజా వార్తలు

Wednesday, 8 June 2016

పవన్ కల్యాణ్ మద్దతు తెలపాలి: వీహెచ్

కాపులను బీసీల్లో చేర్చాలంటూ చేస్తున్న ఉద్యమానికి జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ మద్దతు తెలపాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కాపుల రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. కాపు ఉద్యమాన్ని అణిచివేస్తే, చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వీహెచ్ హెచ్చరించారు.

కాగా తుని ఘటనలో కేసులుండవని చెప్పిన ప్రభుత్వం మాటతప్పి అరెస్టులకు పాల్పడుతోందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిన్న(మంగళవారం) ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం లోగా కేసులు ఉపసంహరించుకోకపోతే ఈనెల 9 నుంచి దీక్షకు ఉపక్రమిస్తానని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే రేపు ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment