తాజా వార్తలు

Saturday, 4 June 2016

'వైఎస్ జగన్ ఇంకా గట్టిగా మాట్లాడతారు?'


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆమె శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను నమ్మించి గొంతు కోశారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. హామీల అమలుపై  వైఎస్ జగన్ మాట్లాడుతున్నారే కానీ, ఆయన వ్యక్తిగత సమస్యలపై మాట్లాడటం లేదన్నారు.  ప్రతిపక్ష నేతగా ఆయన ఇంకా గట్టిగా మాట్లాడతారని వాసిరెడ్డి పద్మ అన్నారు.
టీడీపీ నేతలు సభ్య సమాజం తలదించుకునేలా వైఎస్ జగన్ ను దూషిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ సహనంతో ఉన్నారని అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ప్రజల కష్టంపై మాట్లాడితే హీనాతిహీనంగా విమర్శిస్తారా అని ఆమె ప్రశ్నించారు. సభ్యత, సంస్కారం ఉన్నవారెవరైనా అటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నలు సంధించారు. వైఎస్ జగన్ దిష్టిబొమ్మలు తగలబెడుతుంటే ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో పాలన దుర్భరంగా ఉందని ఆమె ధ్వజమెత్తారు.
« PREV
NEXT »

No comments

Post a Comment