తాజా వార్తలు

Thursday, 9 June 2016

'నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో ప్రభుత్వం వివక్ష'

నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో వివక్ష చూపుతున్నారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణా మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ లో వేణుగోపాలకృష్ణా విలేకర్లతో మాట్లాడుతూ... గతంలో ఆళ్లగడ్డలో గంగూల ప్రభాకర్ రెడ్డి పేరిట నిధులు మంజూరు చేసి... ఇప్పుడు పార్టీ మారాక అఖిల ప్రియ పేరుతో నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు.

అలాగే గతంలో కడప జిల్లాలో జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి పేరుతో నిధులు విడుదల చేసి... ప్రస్తుతం పార్టీ మారిన ఆదినారాయణరెడ్డి పేరుతో నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఓ న్యాయం.... టీడీపీ ఎమ్మెల్యేలకు మరో న్యాయమా అని వేణుగోపాల్ కృష్ణా ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వేణుగోపాలకృష్ణా నిప్పులు చెరిగారు. చంద్రబాబు విధానాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని వేణుగోపాలకృష్ణా ఆరోపించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment