తాజా వార్తలు

Monday, 6 June 2016

కేసీఆర్.. దమ్ముంటే అరెస్టు చెయ్: వీహెచ్

‘టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని, కేసులు పెట్టి అరెస్టు చేయిస్తానన్న’ సీఎం కేసీఆర్ దమ్ముంటే ముందు తనను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సవాల్ విసిరారు.
సోమవారం జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక దినం కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. వీహెచ్ మాట్లాడుతూ రాబోవు రెండు సంవత్సరాలలో టీఆర్‌ఎస్ పనే ఖతం కాబోతోందన్నారు. సీఎం కేసీఆర్ బెదిరింపులకు ఏ నాయకుడూ భయపడొద్దని అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment