తాజా వార్తలు

Wednesday, 15 June 2016

విక్టరీ 'పవర్‌' చూపించనున్న మారుతి.?

వెంకటేష్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' చిత్రం తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ సినిమాలో వెంకటేష్‌ చాలా క్లాస్‌గా కనిపిస్తున్నాడు. హీరోయిన్‌ నయనతార సంగతి సరే సరి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలొచ్చాయి. ఇది మూడో సినిమా. 

'దృశ్యం', 'గోపాల గోపాల' చిత్రాల్లో వయసుకి తగ్గ పాత్రలు పోషించిన వెంకటేష్‌, 'బాబు బంగారం' సినిమా కోసం యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లుక్‌తో దర్వనమిస్తున్నాడు. ఇదంతా మారుతి చేయించిన మేకోవర్‌ మహిమేనట. నయనతార విషయంలో కూడా మారుతి చాలా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. ఇక, ఈ సినిమాలో వెంకటేష్‌తో మాంఛి పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కూడా చేయించేశాడ మారుతి. 

'భలే భలే మగాడివోయ్‌' సినిమాలో ఆద్యంతం నానిని కూల్‌గా చూపించిన మారుతి, చివర్లో బీభత్సమైన యాక్షన్‌ హీరోని చేసేశాడు. 'బాబు బంగారం' అనే క్లాస్‌ టైటిల్‌ పెట్టిన మారుతి, ఈ సినిమాలోనూ వెంకటేష్‌తో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చేయించాడని టాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇప్పటిదాకా కెరీర్‌లో వెంకటేష్‌ కొన్ని డిఫరెంట్‌ మేనరిజమ్స్‌లో కనిపించారు. వాటన్నిటిలోంచీ టాప్‌ ఫైవ్‌ మేనరిజమ్స్‌ని ఎంపిక చేసి, ఇందులో వాడేశాడట మారుతి. 

ఓవరాల్‌గా 'బాబు బంగారం' వెంకటేష్‌ అభిమానులకి మంచి కిక్‌ ఇవ్వనుందట. స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం తొలిసారిగా దక్కడంతో మారుతి, దాన్ని సదవకాశంగా భావిస్తూ సినిమాతో బీభత్సమైన కమర్షియల్ హిట్ కొట్టాలనే కసితో వున్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.
« PREV
NEXT »

No comments

Post a Comment